ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో.అంతర్జాతీయ స్థాయి. ఆసుపత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో.అంతర్జాతీయ స్థాయి. ఆసుపత్రి
ap


విశాఖపట్నం,, 30 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రి రానుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏఐజీ ఆస్పత్రికి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్రేపు (సోమవారం)శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచస్థాయి హెల్త్కేర్, అకడమిక్ అండ్ రీసెర్చ్ హబ్ ఏర్పాటు చేయనుంది.

రూ.2వేల కోట్ల పెట్టుబడితో 9వేల మందికి ఉద్యోగాలను ఏఐజీ హాస్పిటల్స్ కల్పించనుంది. విశాఖలో 9 ఎకరాల్లో ఈ ఆస్పత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయనుంది. 50కు పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనుంది. వైద్యరంగంలో ఏఐజీ హాస్పిటల్స్కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande