డివైడర్ ను ఢీ కొట్టిన లారీ...మంటలు చెలరేగి రెండు ద్విచక్రవాహనాలు.దగ్దం
డివైడర్ ను ఢీ కొట్టిన లారీ...మంటలు చెలరేగి రెండు ద్విచక్రవాహనాలు.దగ్దం
accident


కంభం:, 30 ఆగస్టు (హి.స.)

ఓ లారీ డివైడర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగి లారీ, మరో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో జరిగింది. లారీ దాచేపల్లి నుంచి గిద్దలూరు వైపునకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande