భట్టిప్రోలు మార్కెట్ యార్డులో రూ.49.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్
భట్టిప్రోలు మార్కెట్ యార్డులో రూ.49.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్
భట్టిప్రోలు మార్కెట్ యార్డులో రూ.49.50 లక్షలతో  నూతనంగా నిర్మించనున్న రైతు బజార్

అమృతలూరు:, 30 ఆగస్టు (హి.స.)

భట్టిప్రోలు మార్కెట్యార్డ్లో రూ.49.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రైతుబజార్ నిర్మాణ పనులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు రైతుబజార్ ఉపయోగపడుతుందన్నారు. రైతులకు స్టాళ్లు ఉచితంగా కేటాయిస్తామని, డ్వాక్రా మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జాయింట్ కలెక్టర్ నిర్ణయించిన అద్దె ప్రకారం కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పూర్ణకుమారి, కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande