
పోలవరం:, 30 ఆగస్టు (హి.స.)
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ట్రాకర్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రాజెక్ట్ ఇంజినీర్లకు ఏజెన్సీల ప్రతినిధులకు తెలియజేశారు. ఆదివారం ఉదయం ముంపు గ్రామమైన దేవరగొంది సమీపంలో జంట సొరంగాల పరిసరాల్లో పెద్దపులి కదలికలు గుర్తించినట్లు చెప్పారు. దాన్ని పట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలవరం అటవీ శాఖ అధికారి ఎస్కే వలి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ