పోలవరం.ఎడమ కాలువ గోదావరి జలాలతో అనకాపల్లి. కి.కొత్త జలకళ
పోలవరం.ఎడమ కాలువ గోదావరి జలాలతో అనకాపల్లి. కి.కొత్త జలకళ
పోలవరం.ఎడమ కాలువ గోదావరి జలాలతో అనకాపల్లి. కి.కొత్త జలకళ


అనకాపల్లి పట్టణం, 30 ఆగస్టు (హి.స.)

: పోలవరం ఎడమ కాలువ గోదావరి జలాలతో అనకాపల్లికి కొత్త జలకళ సంతరించుకుంటుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆదివారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ రెండో తేదీన ఉత్తరాంధ్రకు చరిత్రాత్మక రోజు అని అన్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీసుకురావాలని లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేసి, ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తోందని కొనియాడారు. ఎడమ కాలువతో గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయానికి కూడా మరింత భూతం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో యూఎఫ్ఐడీసీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గవర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర, డీసీసీబీ ఛైర్మన్ కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande