తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
రూ.27 కోట్లతో చేపట్టిన వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు.
Kishan reddy


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) రూ.27 కోట్లతో చేపట్టిన వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణతో పాటు తెలంగాణలో 42 రైల్వే స్టేషషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. రూ.27 కోట్లతో వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్, 2 లిఫ్టులు, క్యాంటీన్, దివ్యాంగులకు ఆధునిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో కీలకమని, ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande