ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క విస్తృత పర్యటన.. రూ.131.61 కోట్ల పనులకు శంకుస్థాపనలు
ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క విస్తృత పర్యటన.. రూ.131.61 కోట్ల పనులకు శంకుస్థాపనలు
Bhatti


ఖమ్మం, 30 ఆగస్టు (హి.స.)

మధిర నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్ మండలాల్లో ప్రజలకు అవసరమైన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యా, వ్యవసాయ రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చింతకాని మండలంలో కోడుమూరు ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.66 లక్షలు, లచ్చగూడెంలో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు రూ.29 కోట్లు కేటాయించారు.

అలాగే లచ్చగూడెం-నేరడ పీఆర్ రహదారి వరకు చింతకాని-వందనం ఆర్అండ్ బి రహదారి నుంచి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.75 కోట్లు, లచ్చగూడెం— అనంతారం బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేశారు. చింతకాని గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.44 లక్షలు, నాగిలిగొండ ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్లకు రూ.85 లక్షలు, నాగిలిగొండ నుంచి తూటికుంట్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5.25 కోట్లు కేటాయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande