డిజిటల్ పేమెంట్లలో ‘రంగారెడ్డి’ రికార్డు!
రాష్ట్ర జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రంగారెడ్డి జిల్లా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోనూ తన సత్తా చాటుతోంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి.
Digital payment


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) రాష్ట్ర జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రంగారెడ్డి జిల్లా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోనూ తన సత్తా చాటుతోంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత జూలై నెలలో జరిగిన యూపీఐ లావాదేవీల్లో రంగారెడ్డ్డి జిల్లా రూ.35,118.87 కోట్ల వ్యాపారంతో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కర్ణాటకలోని బెంగుళూరు అర్బన్ జిల్లా రూ.96,153.36 కోట్ల లావాదేవీలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, మహారాష్ట్రలోని ముంబై సబ్అర్బన్ (రూ.61,755.96 కోట్లు), పుణె (రూ.51,264.87 కోట్లు) జిల్లాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి జిల్లా తర్వాతి స్థానాల్లో చెన్నై (రూ.31.849.98 కోట్లు), మేడ్చల్-మల్కాజ్గిరి (రూ.31,747.90 కోట్లు), థానే (రూ.29,825 కోట్లు), హైదరాబాద్ (రూ. 24,939 కోట్లు) జిల్లాలు ఉన్నాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ‘ఫోన్పే’ వినియోగంలోనూ రంగారెడ్డి ముందంజంలో ఉంది. గత త్రైమాసికంలో ఒక్క ఫోన్పే ద్వారానే ఏకంగా రూ.1.04 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిపి దేశంలోనే మూడోస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande