
దేవరపల్లి: , 30 ఆగస్టు (హి.స.)
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని చందానగర్ నుంచి ఓ కుటుంబం వ్యాన్లో ఇంటి సామగ్రిని తీసుకొని రాజమహేంద్రవరంకు వెళ్తోంది. దేవరపల్లి - ఖమ్మం (365వ నంబరు బిజీ గ్రీన్ ఫీల్డ్) జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న వ్యాన్.. ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతోనే ఈ ఘటన జరిగింది. వ్యాన్లో ప్రయాణిస్తున్న భార్యాభర్తల గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి రాజమహేంద్రవరం తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ