
పెందుర్తి, 30 ఆగస్టు (హి.స.)
: పెళ్లికి వెళ్తుండగా బైక్ను కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి వేపకుంటకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. నాయుడుతోటలో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు జస్వంత్ (24), రిజ్వాన్ (24) అనే ఇద్దరు యువకులు బైక్పై వెళ్తున్నారు. అదే సమయంలో ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి వీరిద్దరు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ