హైడ్రాకు మద్దతుగా మణికొండలో భారీ ర్యాలీ
హైడ్రాకు మద్దతుగా మణికొండలో భారీ ర్యాలీ
Hydra


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)

ప్రజా ఆస్తులు, చెరువులు, కుంటలు,

నాలాలు, పార్కులు, స్మశాన స్థలాల పరిరక్షణకు హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతుగా మణికొండలో 'వాక్ విత్ హైడ్రా - వీ సపోర్ట్ హైడ్రా' ర్యాలీని ఆదివారం నిర్వహించారు. మర్రిచెట్టు సర్కిల్ వద్ద ప్రారంభమైన ర్యాలీ పంచవటి కాలనీ మీదుగా హుడా కాలనీ వరకు కొనసాగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ వాసిరెడ్డి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ కాలనీల రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళలు, యువత, సీనియర్ సిటిజన్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి నరేష్, సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు, తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామరాజు సీతారాం దాస్ మాట్లాడుతూ.. ప్రజా ఆస్తులను కబ్జాల నుంచి కాపాడుతూ.. వాటిని ప్రజా ప్రయోజనాలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ నేతృత్వంలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, స్మశాన స్థలాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలకు ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు. చెరువులు, కుంటలు, నాలాలు నగర పర్యావరణ వ్యవస్థలో కీలకమైనవని, వాటి పరిరక్షణతో వరదల సమస్యను తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande