ఇస్రో (ISRO) సరికొత్త మైలురాయి: గగన్యాన్ మిషన్ తదుపరి దశ క్రూ మాడ్యూల్ పరీక్ష విజయవంతం
ఇస్రో (ISRO) సరికొత్త మైలురాయి: గగన్యాన్ మిషన్ తదుపరి దశ క్రూ మాడ్యూల్ పరీక్ష విజయవంతం
isro


శ్రీహరికోట,, 31 ఆగస్టు (హి.స.)

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' (Gaganyaan Mission) ప్రాజెక్ట్‌లో మరొక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లి, తిరిగి భూమికి తీసుకువచ్చే అత్యంత కీలకమైన 'క్రూ మాడ్యూల్ రికవరీ అండ్ అబార్ట్ సిస్టమ్' (Crew Module Recovery & Abort System) పరీక్షను ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ పరీక్షలో భాగంగా, రాకెట్ ప్రయోగ సమయంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే వ్యోమగాములు ఉన్న మాడ్యూల్ సురక్షితంగా రాకెట్ నుండి విడిపోయి, పారాచూట్ల సహాయంతో సముద్రంలో ఎలా ల్యాండ్ అవుతుందనే ప్రక్రియను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుకున్న సమయానికి, అత్యంత ఖచ్చితత్వంతో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. భారత నౌకాదళం (Indian Navy) మరియు ఇస్రో రికవరీ బృందాలు సంయుక్తంగా పనిచేసి ఆ మాడ్యూల్‌ను సముద్రం నుండి విజయవంతంగా వెలికితీశాయి.

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. గగన్‌యాన్ యాత్రలో వ్యోమగాముల ప్రాణాల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అని, ఈ పరీక్ష విజయవంతం కావడంతో త్వరలోనే జరగబోయే పూర్తి స్థాయి మానవరహిత అంతరిక్ష ప్రయోగానికి (Unmanned Flight) మార్గం సుగమమైందని ఆయన ప్రకటించారు. భారతదేశం సొంతంగా అంతరిక్షంలోకి మనుషులను పంపే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విజయం దిశగా శరవేగంగా దూసుకుపోతుండటంతో దేశవ్యాప్తంగా సైన్స్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande