యూపీలో ఘోర ప్రమాదం. బాణసంచా కేంద్రంలో పేలుడు.. 8 మంది స్పాట్ డెడ్
యూపీలో ఘోర ప్రమాదం. బాణసంచా కేంద్రంలో పేలుడు.. 8 మంది స్పాట్ డెడ్
Up accident


యూపీ, 31 ఆగస్టు (హి.స.)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మనోరి పవర్ హౌస్ సమీపంలో ఉన్న ఒక బాణసంచా ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు 8 మంది మరణించగా.. మరో 15 మంది వరకు ఫ్యాక్టరీ శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు దాటికి పక్కనే ఉన్న ఐదారు ఇళ్లు కూడా నేలమట్టమైనట్లు సమాచారం.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు సమీపంలోని ఎయిర్ఫోర్స్ జవాన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. తీవ్ర గాయాలైన ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం ప్రయాగ్జ్లోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని కౌశాంబి జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ పాల్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande