
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
టెలికాం సేవల నాణ్యతపై వినియోగదారుల అభిప్రాయాన్ని నేరుగా సేకరించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తన 'మైకాల్' యాప్కు భారీ అప్డేట్ తీసుకొచ్చింది. కొత్త వెర్షన్లో వినియోగదారులు ప్రతి వాయిస్ కాల్ ముగిసిన వెంటనే 1 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇవ్వడంతో పాటు, కాల్ డ్రాప్లు, వాయిస్ క్వాలిటీ, నెట్వర్క్ సమస్యలు వంటి అంశాలను వెంటనే నివేదించే అవకాశం కల్పించింది. కాల్ ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ అడిగే ఫీచర్ను కూడా చేర్చింది. ఇప్పటివరకు సేవల నాణ్యతపై మాత్రమే దృష్టి పెట్టిన ట్రాయ్, ఇకపై వినియోగదారుల కాలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ యాప్ ద్వారా అంచనా వేయనుంది. ప్రస్తుతం ఈ అప్డేట్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. 2018లో ప్రారంభమైన తర్వాత 'మైకాల్' యాప్కు ఇదే తొలి అప్గ్రేడ్ కావడం గమనార్హం. వినియోగదారులు ఇచ్చే ఫీడ్బ్యాక్ను సంబంధిత టెలికాం కంపెనీలతో పంచుకోవడం ద్వారా నెట్వర్క్ లోపాలను గుర్తించి, సేవలను మెరుగుపరచేందుకు ఇది ఉపయోగపడుతుందని ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ తెలిపారు. అదే సమయంలో, ఈ యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని టెలికాం కంపెనీలపై చర్యలకు ఉపయోగించమని కూడా స్పష్టం చేశారు. యాప్లో ఫీడ్బ్యాక్ హిస్టరీ చూడడం, కవరేజ్ టెస్ట్లు నిర్వహించడం వంటి అదనపు సదుపాయాలు కూడా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు