
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఒడిశా రాష్ట్రంలో వరద పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22 జిల్లాలలో దాదాపు 8.6 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు . నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు (ODRAF) మరియు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బలగాలు ఇప్పటివరకు ముంపు ప్రాంతాల నుండి సుమారు 2.67 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలలో ఆశ్రయం కల్పించాయి . బాధితులకు అవసరమైన ఆహారం, మందులు మరియు తాగునీటిని అందించేందుకు వైమానిక దళ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi