
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
భారత న్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన దర్యాప్తు కమిషన్‌కు నేతృత్వం వహించిన ఆంధ్రప్రదేశ్ మరియు మద్రాస్ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్‌మోహన్ సింగ్ లిబర్హాన్ (87) ఇవాళ కన్నుమూశారు . 1992 డిసెంబర్‌లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిన కొన్ని రోజులకే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈయన నేతృత్వంలో 'లిబర్హాన్ కమిషన్'ను ఏర్పాటు చేసింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 17 సంవత్సరాల పాటు సుదీర్ఘ దర్యాప్తు జరిపిన ఈ కమిషన్, 48 సార్లు పొడిగింపులు పొంది చివరకు 2009 లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ ఘటన వెనుక ఉన్నది ముందస్తుగా ప్రణాళిక బద్ధంగా జరిగిన కుట్ర అని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యాయ నిపుణులు మరియు రాజకీయ నాయకులు తమ సెంతాపాన్ని ప్రకటిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi