భారత వినియోగదారల ఖాతాలను రివ్యూలో ఉంచిన వాట్సాప్
భారత వినియోగదారల ఖాతాలను రివ్యూలో ఉంచిన వాట్సాప్
WHATSAPP USERNAME FEATURE


హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ (WhatsApp), భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది వినియోగదారుల ఖాతాలను ఇవాళ ఉదయం నుండి అకస్మాత్తుగా రివ్యూ (Under Review) లో ఉంచింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేదా హెచ్చరికలు లేకుండా తమ అకౌంట్లు బ్లాక్ అయ్యాయని, యాప్‌లోని ఫీచర్లు ఏవీ పనిచేయడం లేదని వందలాది మంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా స్క్రీన్ షాట్లతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. సాంకేతిక లోపం లేదా భద్రతా కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందా అనే దానిపై వాట్సాప్ మాతృ సంస్థ మెటా ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. 24 గంటల పాటు ఈ ఖాతాల పరిశీలన కొనసాగుతుందని స్క్రీన్‌పై చూపిస్తుండటంతో రోజువారీ మరియు వ్యాపార అవసరాల కోసం వాట్సాప్‌పై ఆధారపడే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande