
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
తమిళనాడులో డీఎంకే మరియు టీవీకే (TVK) పార్టీల మధ్య రాజకీయ వివాదం ఇవాళ ఉదయం మరింత ముదిరింది. నిన్న తంజావూరులో జరిగిన ఒక ర్యాలీలో డీఎంకే యువజన విభాగం సెక్రటరీ ఉదయనిధి స్టాలిన్.. ప్రముఖ సినీ నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా, ద్వంద్వార్థాలు వచ్చేలా వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర దుమారం రేగింది. దీనికి నిరసనగా తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ జాతీయ ప్రతినిధి ఇవాళ ఉదయం జాతీయ మహిళా కమిషన్ (NCW) కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఉదయనిధి స్టాలిన్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయన త్రిషకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా నోటీసులు జారీ చేయాలని కమిషన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం చెన్నైలోని ఉదయనిధి నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi