
న్యూఢిల్లీ: , 05 ఆగస్టు (హి.స.)
ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు 2026' కు లోక్‌సభ మరియు రాజ్యసభలు ఆమోదం తెలిపాయి.దేశంలో డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు, ఆలస్యంగా జరిగే నమోదు ప్రక్రియలపై నిఘా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారుకొత్త నిబంధనల ప్రకారం జనన లేదా మరణ వివరాలను రెండేళ్లకు పైగా ఆలస్యంగా నమోదు చేయాలనుకుంటే నేరుగా కోర్టుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ డేటాబేస్ తయారీలో పారదర్శకత కోసం ఈ సవరణలు ఎంతో అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi