డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదు; రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదు; రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం
Udhayanidhi Stalin


చెన్నై:, 05 ఆగస్టు (హి.స.)

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వ్యక్తిగత విషయాలపై చేసిన వ్యాఖ్యలకు గానూ డీఎంకే యువనేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ప్రముఖ తమిళ నటుడితో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాలపై ఉదయనిధి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఆయన నీలంగరై నివాసానికి చేరుకుని విచారణ జరిపారు

ఈ పరిణామాలపై డీఎంకే శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇదంతా రాజకీయ పగ సాధింపు చర్యగా అభివర్ణించాయి .అయితే తాను ఏ మహిళను గానీ, ఎవరి వ్యక్తిత్వాన్ని గానీ కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కూడా జోక్యం చేసుకుని కీలక ఆదేశాలిచ్చింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande