కొత్త వాహనాల థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ గడువు మరో ఏడాది పొడిగిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కొత్త వాహనాల థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ గడువు మరో ఏడాది పొడిగిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court


న్యూఢిల్లీ, 05 ఆగస్టు (హి.స.)

:

దేశంలో కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు సంబంధించి మోటారు వాహన చట్టం కింద థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ వ్యవధిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు భద్రత, ప్రమాదాల బారిన పడే బాధితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం కొత్త కార్లకు ఇకపై 4 ఏళ్లు, ద్విచక్ర వాహనాలకు 6 ఏళ్ల పాటు కొనుగోలు సమయంలోనే బీమా తీసుకోవడం తప్పనిసరి.

దేశంలో తిరుగుతున్న వాహనాల్లో సగానికి పైగా ఇన్సూరెన్స్ లేకపోవడంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించేలా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని కేంద్రానికి సూచించింది. రహదారులపై ఉండే కెమెరాలను బీమా డేటాతో అనుసంధానం చేసి నిబంధనలు ఉల్లంఘించే వారికి నేరుగా ఇ-చలాన్లు పంపాలని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande