
అమరావతి, 07 ఆగస్టు (హి.స.)
Lరాజమండ్రిలో చోటుచేసుకున్న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రమాదం తర్వాత ఐదు రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందిన ఆమెను వైద్యులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో డాక్టర్ ప్రియాంకను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రాజమండ్రికి చెందిన సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు.
డాక్టర్ ప్రియాంకకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ