
మెదక్, 08 ఆగస్టు (హి.స.)
నార్సింగి మండల కేంద్రంలో మెదక్ ఎక్సైజ్ డీటీఎఫ్ బృందం నిర్వహించిన తనిఖీల్లో బీహార్కు చెందిన శివ్ కుమార్ సాడ వద్ద నుంచి 2 కిలోల ఎండు గంజాయి 150 గంజాయి చాక్లెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ చంద్రయ్య ఆదేశాల మేరకు మెదక్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎల్. నరసింహారెడ్డి పర్యవేక్షణలో డీటీఎఫ్ బృందం శుక్రవారం అర్ధరాత్రి నార్సింగి మండల కేంద్రంలో తనిఖీలు చేపట్టింది.
అక్రమంగా మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు శివ్ కుమార్ సాడను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ జే. గోపాల్ మాట్లాడుతూ గంజాయి విక్రయాలు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు