
అమరావతి, 07 ఆగస్టు (హి.స.)
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మహిళ నూర్ బాషా ఆషా (29) హైదరాబాద్లో అనుమానాస్పదరీతిలో మృతిచెందింది. చిలకలూరిపేట వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆషాకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. గత నెలలో ప్రియుడు సుల్తాన్తో కలిసి ఆషా హైదరాబాద్ వెళ్లిపోయింది. అక్కడ మృతిచెందిన తర్వాత ఆమె మృతదేహంతో సుల్తాన్ అంబులెన్స్లో చిలకలూరిపేట సమీపానికి వచ్చాడు. పోలిరెడ్డిపాలెంలో దగ్గర అంబులెన్స్ను వదిలేసి పరారయ్యాడు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పర్చూరు పీఎస్లో సుల్తాన్ లొంగిపోయాడు. అతడిని చిలకలూరిపేట పోలీసులకు పర్చూరు పోలీసులు అప్పగించారు. ఆషా మృతదేహాన్ని చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ