
అమరావతి, 07 ఆగస్టు (హి.స.)
ముదినేపల్లి : ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం చేవూరుపాలెం సెంటర్లోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి శుక్రవారం ఆడికృత్తిక సందర్భంగా కావడి సేవ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కావడి మోశారు. సుమారు 600 మంది పాల్గొని పలు రకాల కావళ్లు సమర్పించారు. ఆలయ ఛైర్మన్ బొంగు రవికుమార్, ఆలయ సహాయ కమిషనర్ ఆర్ గంగా శ్రీదేవి, పాలక వర్గ సభ్యులు, మాజీ సర్పంచి పరస విశ్వేశ్వరరావు ప్రజలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ