
పాయకరావుపేట, 07 ఆగస్టు (హి.స.)
: పాయకరావుపేటలో సీబీఎస్ఈ సౌత్ జోన్-1 హ్యాండ్ బాల్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్లో అండర్- 14, 17, 19 బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని కెమికల్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్త ఎల్.నగేష్ కుమార్ ప్రారంభించారు. హ్యాండ్ బాల్ పోటీలకు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 2500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. శుక్రవారం నుంచి నాలుగు రోజులు పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాశ్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాశ్, ప్రిన్సిపల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ