
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)
ఎల్బీనగర్ నియోజకవర్గం, చింతలకుంట డివిజన్ ఆర్టీసీ కాలనీలో గత 9 నెలలుగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గురువారం, ప్రత్యక్షంగా పరిశీలించారు. జంఘీర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్డు నుంచి మజీదు వరకు రోడ్డు పని పూర్తయినా, మజీదు నుంచి ఎఫ్సీఐ కాలనీ, జీమాట్ మీదుగా పద్మావతి కాలనీ వరకు పనులు నిలిచిపోవడంతో సుమారు 10 కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
అధికారులతో సమీక్ష..
సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులు, ఇంజనీర్లు దామోదర్, విఘ్నేశ్వరి, కాంట్రాక్టర్తో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు చింతల రవికుమార్, ఉపాధ్యక్షులు లగ్గొని శ్రీధర్ గౌడ్, ఆర్టీసీ కాలనీ అధ్యక్షులు ముకుంద్ రాజు, దుసరి మధుగౌడ్, జయపాల్ రెడ్డి, అరుణ్ గౌడ్, సంతోష్ తదితర కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..