రసాయన మందులు ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారంగా మారుతుంది.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
రసాయన మందులు ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారంగా మారుతుంది.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
MLA


నల్గొండ, 07 ఆగస్టు (హి.స.)

మునుగోడు నియోజకవర్గంలో రైతులు

ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చండూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సామర్ధ్య వృద్ధి కార్యక్రమాలపై చండూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో చండూరు మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలను 17 శాఖలకు చెందిన అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయం ఉద్యానవన శాఖకు సంబంధించి జరిగిన చర్చలో మునుగోడు నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు అయ్యే ఖర్చు వచ్చే లాభాలకు సంబంధించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ సాగును పెద్దఎత్తున పెంచేలా చర్యలు తీసుకోవాలని మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం అంతా కల్తీమయమైపోయిందని ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయం అంటేనే మునుగోడు నియోజకవర్గం గుర్తొచ్చేలా ఇప్పటి నుండే రైతులను ప్రోత్సహించాలని కోరారు.. ప్రతి గ్రామం నుండి సిన్సియర్గా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ఎంపిక చేసి వారి ద్వారా మిగతా రైతులను కూడా ప్రోత్సహించేలా చూడాలన్నారు. సేంద్రియ పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యత నాదని భవిష్యత్తులో మునుగోడు నియోజకవర్గ సేంద్రియ పంటలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande