100 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి మంత్రి పొన్నం శంకుస్థాపన
100 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి మంత్రి పొన్నం శంకుస్థాపన
Minister


కరీంనగర్, 07 ఆగస్టు (హి.స.)

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని,

బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం వెన్కేపల్లి-సైదాపూర్ మండల కేంద్రంలో రూ.30 లక్షల వ్యయంతో 100 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి, నూతన వ్యవసాయ మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వనమహోత్సవం కార్యక్రంలో భాగంగా వెన్కేపల్లి, సైదాపూర్ మండల కేంద్రంలో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సైదాపూర్ మండలంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మార్కెట్ యార్డ్ అభివృద్ధికి 1.5 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నామని, రూ.30 లక్షలతో 100 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించుకుంటున్నాం.. వన సంరక్షణ పేరుతో వన మహోత్సవం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పౌరుడుని కోరుతున్నాం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. మార్కెట్ యార్డ్ రాబోయే కాలంలో రైతులకు మరింత సేవలందించే విధంగా ఉంటుందన్నారు. సైదాపూర్ మండలంలోని ఏ గ్రామంలో అయినా ఐదు ఎకరాలు భూమిని కేటాయిస్తే సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అన్నారు.

ప్రతి గ్రామ పౌరుడు వారినివాసంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి.. 5 ఎకరాల పైనున్నవారు ఆయిల్ ఫామ్స్ సాగు చేయాలన్నారు. వర్షపు నీటిని ఆదా చేసుకోవడానికి ఇంజక్షన్ బోర్స్ సిద్ధం చేసుకోవాలి, జలసిరీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.

జలసిరి రైతాంగానికి అన్ని రకాలుగా ఉపయోగపడే కార్యక్రమం. భవిష్యత్తులో నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం, సైదాపూర్ రైతులు వారి ఉత్పత్తుల అమ్ముకోవడానికి సబ్ మార్కెట్ యార్డు ఉపయోగపడుతుంది. మనకు దగ్గరలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ ఉంది.. ప్రతి ఒక్కరు ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande