చేనేత కళకు కీర్తి కిరీటం.. రాజోలి నేతన్నకు అరుదైన గౌరవం
చేనేత కళకు కీర్తి కిరీటం.. రాజోలి నేతన్నకు అరుదైన గౌరవం
Minister


హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)

జాతీయ చేనేత దినోత్సవాన్ని

పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో గద్వాల చీరకు ప్రతిష్ఠాత్మక బహుమతి లభించింది. గద్వాల చీర ప్రత్యేకతను చాటుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క చేతులమీదుగా రాజోలి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సూరె గోపాల్ ఈ రాష్ట్రస్థాయి బహుమతిని అందుకున్నారు. గద్వాల చీరకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల రాజోలి గ్రామస్తులు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ చేనేత కళను కాపాడుతూ, గద్వాల చీరకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సూరె గోపాల్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. ఈ పురస్కారం చేనేత కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందని వారు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande