విద్యార్థులే దేశ భవిష్యత్తు : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
విద్యార్థులే దేశ భవిష్యత్తు : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Mla


మిర్యాలగూడ, 07 ఆగస్టు (హి.స.): ప్రస్తుత విద్యార్థుల దేశ భవిష్యత్తు

అని, చదువు ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని అన్నారు. ఉదయం అల్పాహారం తో పాటు మధ్యాహ్న భోజనం, ఉచిత రవాణా ఉచిత భోజనం లాంటి సౌకర్యాన్ని కల్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ధర్మ నాయక్, కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande