
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)
తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్ ఫీజులపై
విద్యాశాక కీలక ఆదేశాలు జారీ చేసింది. తరగతుల వారీగా ఫిజుల వివరాలను ఎడ్యుకేషన్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. పాఠశాలలు స్కూల్ ఫీజు పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపింది. ఫీజులు చూపించని స్కూళ్లకు షోకాజ్ నోటీసులు పంపిస్తామని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయి.
నర్సరీ, ఎకేజీ, యూకేజీలకే ఏడాదికి 30వేల నుండి లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నాయి. స్కూల్ ఫీజులతో పాటు స్కూల్ లోనే పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని కండిషన్ పెడుతున్నాయి. వాటికి సైతం వేలల్లో వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో స్కూల్ ఫీజులపై పేరెంట్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమిళనాడు తరహా స్కూల్ ఫీజులను ప్రభుత్వాలు నియంత్రించాలని కోరుతున్నారు. ఇక తాజాగా విద్యాశాఖ ఆదేశాలతో ప్రైవేట్ స్కూల్స్ నుండి తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుందా లేదా చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు