బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 పరీక్ష విజయవంతం
బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 పరీక్ష విజయవంతం
agni 4


హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)

ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 పరీక్షను భారత రక్షణ రంగం విజయవంతంగా నిర్వహించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని, భారత సైన్యానికి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఒక రొటీన్ యూజర్ ట్రయల్‌గా భాగంగా రాత్రి వేళల్లో పరీక్షించారు . ఈ క్షిపణి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలదు మరియు అణు ఆయుధాలను సైతం మోసుకెళ్లే వ్యూహాత్మక సామర్థ్యం దీనికి ఉంది

రెండు దశల సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడిచే ఈ క్షిపణి పొడవు 20 మీటర్లు కాగా, బరువు దాదాపు 17 టన్నులు ఉంటుంది. ఇందులో అత్యాధునిక ఏవియానిక్స్, ఐదో తరం ఆన్‌బోర్డ్ కంప్యూటర్ మరియు రింగ్ లేజర్ గైరో ఆధారిత నావిగేషన్ వ్యవస్థలను అమర్చారు. రాత్రి వేళల్లో జరిగిన ఈ ప్రయోగంలో క్షిపణి నిర్దేశిత మార్గంలో ప్రయాణించి అన్ని రకాల ఆపరేషనల్, సాంకేతిక ప్రమాణాలను విజయవంతంగా అందుకుందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది . ఈ ప్రయోగానికి ముందు భద్రతా కారణాల దృష్ట్యా హిందూ మహాసముద్ర పరిధిలో దాదాపు 3,000 కిలోమీటర్లకు పైగా ప్రాంతంలో ముందస్తుగా విమాన ప్రయాణాలపై ఆంక్షలను కూడా విధించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనిక దళాలకు, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande