జంతర్ మంతర్ వద్ద ధర్నాలపై హైకోర్టు సీరియస్: కేంద్రానికి, పోలీసులకు నోటీసులు
జంతర్ మంతర్ వద్ద ధర్నాలపై హైకోర్టు సీరియస్: కేంద్రానికి, పోలీసులకు నోటీసులు
High court


న్యూఢిల్లీ, 07 ఆగస్టు (హి.స.)

ఢిల్లీలోనీ వీఐపీ ప్రాంతమైన జంతర్

మంతర్ వద్ద నిరసనలు, ధర్నాల వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అసలు ఆ ప్రాంతంలో ఆందోళనలను ఎందుకు శాశ్వతంగా మూసివేసి నిలిపివేయకూడదని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. జంతర్ మంతర్ను ధర్నా చౌక్గా నిర్ణయించడం వల్ల స్థానికులకు, రాకపోకలు సాగించే వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. జంతర్ మంతర్ సమీపంలో నిరసనల వల్ల నిరంతరం ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని, ధ్వని కాలుష్యం పెరిగిపోతోందని, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆందోళనలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించవచ్చని, వీఐపీ ప్రాంతంలో ఉన్న జంతర్ మంతర్ ను ప్రదర్శనల వేదికగా ఎందుకు కొనసాగిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD), ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిరసనల నిబంధనలపై తగిన నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande