ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు
cheneta


హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)

భారతదేశ సంస్కృతి, వారసత్వంలో కీలకమైన చేనేత రంగాన్ని గౌరవించడం మరియు నేత కార్మికులను ఆదుకోవడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ప్రతి ఏటా ఈ రోజున చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఒక సరికొత్త పిలుపునిచ్చారు. ప్రస్తుతం యువతలో ఎంతో ప్రజాదరణ పొందిన 'గెట్ రెడీ విత్ మీ' (GRWM) ట్రెండ్‌ను ఉపయోగించుకుంటూ, ప్రజలందరూ తమకు ఇష్టమైన భారతీయ చేనేత దుస్తులను ధరించి ఆ వీడియోలను, ఫోటోలను పంచుకోవాలని కోరారు. ఇది కేవలం ఒక ప్రచారం మాత్రమే కాకుండా, మన స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు తెచ్చే ఒక గొప్ప ప్రయత్నం అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు చేనేత సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు మరియు నేత కార్మికులకు పురస్కారాల ప్రధానోత్సవాలు జరుగుతున్నాయి. ఖాదీ, సిల్క్, కాటన్ వంటి వైవిధ్యమైన భారతీయ హస్తకళల గొప్పతనాన్ని చాటిచెప్పేలా విద్యాసంస్థలు, కార్యాలయాల్లో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ విదేశీ బ్రాండ్ల వైపు కాకుండా 'వోకల్ ఫర్ లోకల్' నినాదంతో స్వదేశీ దుస్తులను కొనుగోలు చేసి మన నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande