తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలోకి అత్యాధునిక కెమెరా ఉన్న కళ్ళజోడుతో ప్రవేశం
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలోకి అత్యాధునిక కెమెరా ఉన్న కళ్ళజోడుతో ప్రవేశం
Tiruvannamalai Temple


వేలూరు, 09 ఆగస్టు (హి.స.)

, :పంచభూత లింగ ఆలయాల్లో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోకి అత్యాధునిక కెమెరా ఉన్న కళ్లజోడుతో ప్రవేశించిన తెలంగాణకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆలయం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లపైనా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తెలంగాణకు చెందిన పవనేశ్, మహేశ్ అత్యాధునిక కెమెరా ఉన్న కళ్లజోడు పెట్టుకుని ఆలయ క్యూలైన్లో నిల్చున్నారు. వారి వ్యవహారశైలిని అనుమానించిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కళ్లజోడులో కెమెరా ఉన్నట్టు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande