
అమరావతి, 01 సెప్టెంబర్ (హి.స.)
ఉన్నత విద్యాశాఖలో ఇష్టానుసారంగా కాలేజీల షిఫ్టింగ్కు అనుమతులు ఇస్తున్నారు. కౌన్సెలింగ్ సమయంలో రెండు డిగ్రీ కాలేజీలను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి నుంచి వేరే మండలాలకు మార్చుకునేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు. విశాఖపట్నంలో గాజువాక నుంచి మధురవాడకు, పశ్చిమగోదావరిలో వేగవరం నుంచి ఏలూరులోని అగ్రహారానికి మార్చుకునేందుకు అనుమతులు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ