తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్
High court


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు డివిజన్ బెంచ్లో భారీ ఊరట లభించింది. ఈ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ విధించిన స్టే ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు ఈ పథకాలు ఆర్థికంగా కొండంత చేయూతనందిస్తున్నాయని కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి, నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి ఈ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయని వివరించారు. ప్రభుత్వం తరుఫున వినిపించిన వాదనలతో ఏకీభవించిన డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్స్పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సంక్షేమ పథకాల అమలుకు ఎదురైన చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande