నల్గొండలో హై టెన్షన్... హైదరాబాద్లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్
నల్గొండలో హై టెన్షన్... హైదరాబాద్లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్
High tension


నల్గొండ, 01 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. తార్నాకలోని నివాసంలో రామచంద్ర రావును పోలీసులు గృహనిర్భందం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ ఇంటిపై దాడి జరింగింది. మొదట మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ ఆఫీస్పై బీజేపీ శ్రేణులు కోడిగుడ్లు, టమాటాలతో విరుచుకుపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మతో పాటు ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వర్గం నాగం వర్షిత్రెడ్డి ఇంటిని ముట్టడించింది. వర్షిత్రెడ్డి ఇంట్లోకి చొరబడి అక్కడున్న ఫర్నిచర్ను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేశారు.

వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు నేడు నల్గొండ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమై హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నేడు మంత్రి కోమటిరెడ్డి సైతం నల్గొండలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో జిల్లాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందా..? అనే ఆందోళన నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande