మంత్రి పదవి రేసులోకి మరో కీలక నేత ఎంట్రీ.. ఢిల్లీలో ఖర్గేతో భేటీ!
మంత్రి పదవి రేసులోకి మరో కీలక నేత ఎంట్రీ.. ఢిల్లీలో ఖర్గేతో భేటీ!
Political


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన సంకేతాలతో అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు వేగం పెంచారు. వచ్చే సెప్టెంబర్ నెలలోనే పదవుల భర్తీ, పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పష్టత వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడంతో మంత్రి పదవులు ఆశీస్తున్న నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే కేబినెట్ బెర్త్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, జి.సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్ వంటి కీలక నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, అనూహ్యంగా ఈ మంత్రి పదవి రేసులోకి మరో ముఖ్య నేత ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం కేబినెట్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande