మెరుగైన మౌలిక వసతులే లక్ష్యం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మెరుగైన మౌలిక వసతులే లక్ష్యం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Mla


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య వసతులు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా మౌలిక వసతులు, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు తదితర సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande