వెలిగొండ నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకులు.. రక్షించిన రెస్క్యూ టీం
వెలిగొండ నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకులు.. రక్షించిన రెస్క్యూ టీం
వెలిగొండ నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకులు.


మార్కాపురం, 01 సెప్టెంబర్ (హి.స.)మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది.

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande