
తిరుపతి, 01 సెప్టెంబర్ (హి.స.) తిరుపతి విమానాశ్రయం నుంచి నడిచే పలు విమాన సర్వీసుల వేళల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అవి నేటి (01-09-2026) నుంచి అమలు అవుతాయని వివరించారు.
ఇండిగో సర్వీసులు..
హైదరాబాద్ - తిరుపతి: ఉదయం 7:20కి వచ్చి, తిరిగి 8:00 గంటలకు బయలుదేరుతుంది.
హైదరాబాద్ - తిరుపతి: ఉదయం 11:15కి వచ్చి, తిరిగి 11:45 గంటలకు బయలుదేరుతుంది.
హైదరాబాద్ - తిరుపతి: మధ్యాహ్నం 1:50కి వచ్చి, తిరిగి 2:30 గంటలకు బయలుదేరుతుంది.
విశాఖపట్నం - తిరుపతి: మధ్యాహ్నం 3:30కి వచ్చి, తిరిగి సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరుతుంది.
ఢిల్లీ - తిరుపతి: సాయంత్రం 6:25కి వచ్చి, తిరిగి రాత్రి 7:05 గంటలకు బయలుదేరుతుంది.
హైదరాబాద్ - తిరుపతి: రాత్రి 8:20కి వచ్చి, తిరిగి రాత్రి 9:00 గంటలకు బయలుదేరుతుంది.
స్టార్ ఎయిర్లైన్స్ సర్వీస్..
శివమొగ్గ - తిరుపతి: మధ్యాహ్నం 12:20కి వచ్చి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతుంది.
ఎయిర్ ఇండియా సర్వీస్..
హైదరాబాద్ - తిరుపతి: సాయంత్రం 5:10కి వచ్చి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV