ఇండియాకు గ్యాంగ్స్టర్ అమృత్పాల్ సింగ్....సంబంధిత ప్రక్రియ పూర్తి
ఇండియాలో అనేక నేరాలకు పాల్పడ్డా గ్యాంగ్స్టర్ అమృత్పాల్ సింగ్ మాల్దోవాలో పట్టుబడ్డాడు. పంజాబ్కు చెందిన ఈ గ్యాంగ్స్టర్ ని ఇండియాకు తీసుకురానున్నారు.
Amritpal


ఢిల్లీ , 12 సెప్టెంబర్ (హి.స.) ఇండియాలో అనేక నేరాలకు పాల్పడ్డా గ్యాంగ్స్టర్ అమృత్పాల్ సింగ్ మాల్దోవాలో పట్టుబడ్డాడు. పంజాబ్కు చెందిన ఈ గ్యాంగ్స్టర్ ని ఇండియాకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. పంజాబ్ సహా అనేక ప్రాంతాల్లో అతడిపై 21 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతడు 2024 అక్టోబర్లో చండీగఢ్ నుంచి జారీ చేసిన ఫేక్ పాస్పోర్టు ఉపయోగించి, ఇండియా నుంచి పారిపోయాడు.

అప్పటినుంచి పంజాబ్ పోలీసులు అతడి కోసం గాలిస్తూనే ఉన్నారు. మొదట అతడు యూఏఈ వెళ్లాడు. తర్వాత అక్కడినుంచి వివిధ దేశాలకు వెళ్లిపోయాడు. చివరగా మాల్దోవా దేశం వెళ్లాడు. అక్కడినుంచి సరిహద్దు మార్గంలో ఉక్రెయిన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న మాల్దోవా పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రం ప్రభుత్వం

అతడిని పట్టుకునేందుకు ఆపరేషన్ ఈస్టర్న్ రీచ్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మాల్దోవాలో ఉన్న అతడిని తీసుకొచ్చేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. కేంద్ర సంస్థలు, మాల్దావా పోలీసులతో కలిసి చర్యలు చేపట్టాయి. అతడిని ఇండియాకు అప్పగించాల్సిందిగా మాల్దోవా ప్రభుత్వాన్ని ఇండియా కోరింది. దీనికి అక్కడి కోర్టు అంగీకరించింది. మే 26న అతడిని అప్పగించేందుకు అంగీకరించింది. అయితే, ఈ నిర్ణయాన్ని అతడు పై కోర్టులో సవాలు చేశాడు. దీనిపై ఇంతకాలం విచారణ జరిగింది. చివరకు అతడి పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. అతడిని ఇండియాకు అప్పగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అక్కడి చిసినౌ ఎయిర్పోర్టులో ఇండియాకు అప్పగించింది. సెప్టెంబర్ 12న అతడిని పంజాబ్ పోలీసులు ఇండియా తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఇండియా చేరుకున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande