బ్రిటన్లో శిక్షణ ఇవ్వనున్న ముగ్గురు భారత పైలట్లు
చరిత్రలో మొట్ట మొదటిసారి బ్రిటన్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యువ పైలట్లకు భారతీయ వైమానిక దళానికి చెందిన ముగ్గురు పైలట్లు శిక్షణ ఇవ్వనున్నారు.
Pilot


ఢిల్లీ , 12 సెప్టెంబర్ (హి.స.)చరిత్రలో మొట్ట మొదటిసారి బ్రిటన్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యువ పైలట్లకు భారతీయ వైమానిక దళానికి చెందిన ముగ్గురు పైలట్లు

శిక్షణ ఇవ్వనున్నారు. రెండేళ్ల పాటు ఆ ముగ్గురు అక్కడ శిక్షణ ఇస్తారు. ఆ ముగ్గురి పైలట్ల ఫోటోను ఐఏఎఫ్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది.

వేల్స్లోని ఆర్ఏఎఫ్ వ్యాలీలో ఆ ట్రైనింగ్ కేంద్రం ఉన్నది. క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్గా ఐఏఎఫ్ పైలట్లు ఆర్ఏఎఫ్లో చేరారు. భారత్, యూకే సంబంధాలు ఇది కొత్త మైలురాయి అని ఐఏఎఫ్ పేర్కొన్నది. స్వ్కాడ్రన్ లీడర్ స్థాయి ఆఫీసర్ నాయకత్వం వహిస్తున్నారు. బీఏఈ హాక్ టీ2 ఎయిర్క్రాఫ్ట్లో ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande