
ఢిల్లీ , 12 సెప్టెంబర్ (హి.స.) చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో జిన్పింగ్కు భారత ప్రతినిధుల బృందం స్వాగతం పలికారు. పలువురు కళాకారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనతో ఆయన్ను ఆహ్వానించారు.
బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల అధినేతలతో కలిసి జిన్పింగ్ పలు అంతర్జాతీయ, వాణిజ్య, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. జిన్పింగ్ రాక నేపథ్యంలో దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు ఏడేళ్ల తర్వాత జిన్పింగ్ భారత్లో అడుగు పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్