
అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)
బలిజిపేట మండలంలోని వెంగాపురం శ్రీభారతి పబ్లిక్ పాఠశాలకు చెందిన ఎనిమిది, తొమ్మిదో తరగతికి చెందిన 24 మంది విద్యార్థులు ఐదు రోజులుగా తయారు చేసిన 500 మట్టి వినాయక ప్రతిమలను యాజమాన్యం ఆదివారం బలిజిపేటలో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసింది.
ఆ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు బూరాడ జగన్మోహనరావు, ఉపాధ్యాయులు జె. జనార్ధననాయుడు తదితరులు బలిజిపేట ఉన్నత పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేసిన మట్టి ప్రతిమల పంపిణీ శిబిరం వద్ద వీటిని అందరికీ అందజేశారు. కాలుష్యం నివారణకు, పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఏడాది ఈ మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులతో తయారుచేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ