కాంగ్రెస్ పార్టీపై మధుసూదనా చారి ఆరోపణలు
శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి కాంగ్రెస్ పార్టీని ఆరోపించారు.
Madhusudhan chari


తెలంగాణ , 13 సెప్టెంబర్ (హి.స.)శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి కాంగ్రెస్ పార్టీని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శాసన సభ, మండలి సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. సభను నడిపే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, పోలీసుల మోహరింపు, లైవ్ కవరేజీలో వివక్ష చూస్తుంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తామిచ్చిన 20 అంశాలను, వాయిదా తీర్మానాలను పక్కనపెట్టి, కేవలం బిల్లుల ఆమోదానికే ప్రాధాన్యత ఇస్తూ చర్చకు భయపడ్డారని పేర్కొన్నారు. చర్చలకు, పరిష్కరాలకు వేదికగా నిలబడాల్సిన కౌన్సిల్ ఆరు రోజులు కుట్రలకు వేదికలాగా అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షాలకు ఇబ్బంది పెట్టడానికి, పాలకపక్షానికి ఇష్టారీతిన వ్యవహరించడానికి కారణమైందని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande