రోడ్డు ప్రమాదం......రాజుపాలెం కంటైనర్ బోల్తా
మద్దిపాడు మండల పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వెంకట రాజుపాలెం వద్ద కార్లు రవాణా చేసే కంటైనర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి.
Accident

అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)

మద్దిపాడు మండల పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వెంకట రాజుపాలెం వద్ద కార్లు రవాణా చేసే కంటైనర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి.

హైవే మొబైల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం చెన్నై నుంచి నాగాలాండ్కు కార్ల లోడ్తో ఓ కంటైనర్ వెళ్తోంది. మండల పరిధిలోని వెంకటరాజు పాలెంకు వచ్చే సమయానికి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నితీష్ యాదవ్కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రుడిని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande