నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి.. ఆసిఫాబాద్ ఎస్పీ
గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వాహకులు శాంతియుతంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిన్పం పంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
SP


ఆసిఫాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

గణేష్ నవరాత్రి ఉత్సవాలను

నిర్వాహకులు శాంతియుతంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిన్పం పంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గణేష్ మండపాల నిర్వాహకులు ఆయా మండపాల పేరుతో తెలంగాణ పోలీస్ పోర్టల్https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. అలాగే గణేష్ మండపం వద్ద 24 గంటలు వాలంటరీలతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటూ..ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాల ను ఏర్పాటు చేసుకోవాలని రాత్రి 10 దాటిన తర్వాత మైక్, సౌండ్ సిస్టం, డీజేలు వినియోగించొద్దని, అసభ్యకర నృత్యాలు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగాలు, జూదం, లక్కీ డ్రాలు, బలవంతపు చందాలు లేదా మద్యం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande